Oct 27,2023 09:56

ముంబయి : వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ ముంబయి వేదికగా జరగనుంది. నవంబర్‌ 2న జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను బీసీసీఐ విడుదల చేసంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌ వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా భారత్‌ మ్యాచ్‌కు వారం ముందే టికెట్లను విడుదల చేయడం ఇది రెండోసారి. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కూ ఖాళీలనుబట్టి టికెట్లను మరోసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని సీట్లు ఖాళీగా కనిపించాయి. ఆన్‌లైన్‌లో మాత్రం అన్నీ బుక్‌ అయినట్లు చూపించడం గమనార్హం.

వన్డే ప్రపంచ కప్‌లో నేడు...
సౌతాఫ్రికా × పాకిస్థాన్‌
వేదిక : చెన్నై, సమయం : 2.00 గంటలకు