హైదరాబాద్ : నిఫ్టీ అల్ఫా 50 ఇండెక్స్‌ను విడుదల చేసినట్లు బంధన్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ట్రాకింగ్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అని తెలిపింది. ఇది పెట్టుబడిదారులకు పూర్తి వైవిధ్యమైన స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుందని ఆసంస్థ పేర్కొంది. కొత్త ఫండ్ ఆఫర్ 2023 అక్టోబర్ 25న తెరవబడుతుందని.. నవంబర్ 6తో ముగియనుందని తెలిపింది.