
హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్‌ను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ మేరకు రూ.1,450 కోట్లు విడుదల చేసినట్లు ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్ తెలిపారు. దసరా, దీపావళి బోనస్ చెల్లింపునకు కూడా సింగరేణి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి ఎరియర్స్ రూపంలో రూ.3.70 లక్షల మేర వచ్చినట్లు పేర్కొన్నారు.