సన్ ఫ్లవర్ ఆయిల్‌లో మార్కెట్ లీడర్
జిఇఎఫ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : జెమినీ ఎడిబుల్స్ అండ్ ప్యాట్స్ ఇండియా (జిఇఎఫ్) కొత్తగా 10 లీటర్ల జారులో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో దీనిని జిఇఎఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్ర శేఖర రెడ్డి, నటీ సుమ కనకాల ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం బహుళ పరిమాణాల్లో తమ ఉత్పత్తులు లభిస్తున్నాయన్నారు. ఈ నూతన పునర్ వినియోగించతగిన 10లీటర్ల బహుళ వినియోగ జార్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చనుందన్నారు. సమయం, స్థలాన్ని ఆదా చేయడంతో పాటుగా నిల్వ సమస్యలను నివారించడం కోసం తెలివైన ఎంపికలను చూస్తున్న మహిళలకు ఇది గొప్ప ఎంపికగా నిలుస్తుందన్నారు. వంట నూనె వినియోగం తర్వాత బహుళ వినియోగాలకు పనికి వస్తుందన్నారు. దేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ కేటగిరీలో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నంబర్ 1 విక్రయ బ్రాండ్‌గా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 50,000 టన్నులకు పైగా వినియోగంలో ఉందన్నారు. తెలంగాణలో 36 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 67.5 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉందన్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో కీలక వాటాను కలిగి ఉన్నామన్నారు.