ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్) : వీఆర్‌ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభించారు. వీఆర్‌ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. డిఏతో కలిపిన వేతనం 10,900 ఇవ్వాలని, వీఆర్‌ఏ నుండి 2021 నుండి జీతంలో కట్ చేసిన డీఎ తిరిగి చెల్లించాలన్నారు. నామినిగా పనిచేస్తున్న విఆర్‌ఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వీఆర్‌ఏ నుండి వీఆర్వోగా ప్రమోషన్ జీవో 13 ప్రకారం సీనియార్టీ ప్రకారం ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ప్రమోషన్ ఇవ్వాలన్నారు. నైట్ వాచ్మెన్ అటెండర్, చైన్ మెన్ గాను, సీనియార్టీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 847 ప్రకారం 20 నుండి 75 శాతం వరకు పెంచాలన్నారు. డివిజన్ పరిధిలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు వీఆర్‌ఏలతోనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కుక్కల శ్రీనివాసరావు, వీఆర్‌ఏ సంఘం నాయకులు జి. జానకి రామయ్య, టి నరసింహారావు షేక్ జాన్వి ఏ హేమలత, ఎం గురవయ్య, జీ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










