న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలాష్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. 400 రోజుల గడువు కలిగిన ఈ ఎఫ్‌డి ప్లాన్‌లో అధిక వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 12 నుంచి మళ్లీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్‌లో డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటును కల్పిస్తున్నట్లు పేర్కొంది. 2023 ఫిబ్రవరి 15న ఈ ప్లాన్‌ను ఆవిష్కరించగా.. 2023 మార్చి 31 వరకు అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో గడువు పెంచింనట్లయ్యింది. ఈ ప్లాన్‌లో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.6 శాతం వడ్డీ అందిస్తుంది. అమృత్ కలాష్ ప్లాన్ వచ్చే జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బిఐ తెలిపింది.










