
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉద్యోగోన్నతికి శాశ్వత తిరస్కారం తెలిపినా, మరలా పొందేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎపిఎస్‌ఎస్‌ఆర్ 1996 రూల్ 28కి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఒకసారి ఉద్యోగి తనకు ప్రమోషన్ వద్దనుకుంటే భవిష్యత్తులో మళ్లీ ప్రమోషన్ పొందే అవకాశం ఉండదు. ప్రభుత్వం తాజాగా చేసిన సవరణతో ప్రమోషన్‌ను తిరస్కరించిన ఉద్యోగి మళ్లీ ప్రమోషన్ కావాలనుకుంటే ఆ అవకాశాన్ని పొందొచ్చు. ఉద్యోగికి ప్రమోషన్లకు అవకాశం కల్పిస్తూ ఎపి స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు సవరణ చేయడం ఉద్యోగులందరికీ మంచిదేనని పురపాలక టీచర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. పురపాలక పాఠశాలల్లో పిల్లలు పది శాతం అదనంగా పెరిగారని, వారికి అనుగుణంగా పురపాలక టీచర్లకు గత మూడేళ్లుగా ఉద్యోగోన్నతులు లేవని, వెంటనే కల్పించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.