Oct 18,2023 15:12

ప్రజాశక్తి-అమరావతి: దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీని ఆప్షనల్‌ హాలీడే బదులు సాధారణ సెలవుగా మార్పు చేసింది. దీంతో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 24న విజయదశమి దృష్ట్యా సెలవులో ప్రభుత్వం ఈ మేరకు మార్పు చేసింది.