న్యూఢిల్లీ : అదాని సిమెంట్ కంపెనీల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి అంతర్జాతీయ బ్యాంక్‌లు అంగీకరించాయని అదాని గ్రూపు వెల్లడించింది. దాదాపు రూ.30వేల కోట్లు (3.5 బిలియన్ డాలర్లు) దీంతో మరిన్ని అనుకూలమైన షరతులతో పాత రుణ స్థానంలో కొత్త రుణాన్ని ఇవ్వనున్నాయి. ఎసిసి, అంబుజా సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేయడం కోసం అదాని గ్రూపు వివిధ సంస్థల నుంచి అప్పులను తీసుకుంది. 3.5 బిలియన్ డాలర్ల ఆ రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి 10 అంతర్జాతీయ బ్యాంకులు సానుకూలత వ్యక్తం చేశాయని అదాని గ్రూపు వెల్లడించింది.