Oct 21,2023 21:17

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఐడిబిఐ బ్యాంక్‌ నికర లాభాలు 60 శాతం పెరిగి రూ.1,323 కోట్లకు చేరాయి. మొండి బాకీలు తగ్గడంతో ఎల్‌ఐసి ఆధ్వర్యంలోని ఈ బ్యాంక్‌ మెరుగైన ఫలితాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.828 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 సెప్టెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా 4.90 శాతానికి తగ్గాయి. 2022 ఇదే సమయం నాటికి ఏకంగా 16.51 శాతం జిఎన్‌పిఎతో తీవ్ర ఒత్తిడిలో ఉంది. నికర నిరర్థక ఆస్తులు 1.15 శాతం నుంచి 0.39 శాతానికి పడిపోయాయి. బ్యాంక్‌ నిరర్థక ఆస్తులు తగ్గడం, ఆదాయం పెరగడంతో ఐడిబిఐ లాభాల్లో మెరుగుదల కనబడింది.