తనువు ధనువుని వంచి
పలుగు శరాన్ని పాతాళానికి దించి
రాతినేలలు తొలిచి
బంగారు రాశులు వెలికితీసే భగీరథుడు
కండలు కరిగించి
ఘర్మజలాన్ని పారించి
నల్ల బంగారు సిరులు పండించే హాలికుడు
నుశి రాశులు పులుముకొని
వెలుగుల మూడోకన్ను తెరచుకొని
కాలుష్య గరళాన్ని
కంఠంలో నింపుకొని
ప్రమాదపుటంచులపై
నిత్య నర్తన చేసే నిటలేక్షణుండు
పుడమి కడుపున
ప్రతి దినముదయించు
పూర్ణచంద్రుడు
అగాథాల దాగున్న
అనంత సంపద వెలికితీసి
సింగరేణి నుదుటిపై
శిరుల సింధూరమద్ది
ఆకలి వేదనలననుభవించు
అభాగ్యుడతడు
నేలమాళిగ నగరాల్లో
వెలుగుదారులు పరచి
చిమ్మ చీకటి బతుకుతో
బొగ్గు గుట్టల గుండెల మాటున
అస్తమిస్తున్న చెమట సూర్యుడు!
- సవ్యసాచి
82470 10450










