Nov 06,2023 21:24

హైదరాబాద్‌ : ప్రముఖ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ రెడ్‌ బస్‌ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ సంస్థ కనెక్టివిటీని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అందులో భాగంగా విలేజ్‌ లెవెల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వీరు దాదాపు 30వేలకు పైగా ఏజెంట్లు ఉన్నారని తెలిపింది. వీరు డిజిటల్‌ సేవా పోర్టల్‌లోని కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల (సిఎస్‌సి) సహకారంతో పని చేస్తున్నారని వెల్లడించింది. ఈ క్రమంలోనే రెడ్‌ బస్‌ సిఎస్‌సితో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థిరమైన వృద్థిని సాధించాలని యోచించామని ఆ సంస్థ పేర్కొంది.