Aug 28,2023 07:32

అటు సూర్యుడు లేక
ఇటు వర్షమూ రాక
ముసురుకుంది ఆకాశం
మనిషి మనసులో దాగిన
ఆలోచనలు ఆవేశాలు
ఒక రూపం ధరించేలోపు
బయటకు రానీయని
అవాంతరాలూ అంతే మరి
కదలనీయని నియంత్రణతో
మనిషి మనసు రాసుకునే
అక్షరాలని కలం దాటకుండా
దాటినా ఒక నిర్దిష్ట రూపాన్ని
ధరించనీకుండా దరి చేరకుండా
చేసే విచిత్ర బాహ్య చిత్రం
అంతరాంతరాల్లోని బాధని
దయతో ఎందుకు చూస్తుంది
అంతరాయం కలిగించడమే కద
తన నియమిత అర్థం పరమార్ధం
అందుకే ఎదురేగి ఎదిరించి
తన రూపాన్ని తానే పొందాలని
చేసే ప్రయత్నమే నిజజీవిత చిత్రం!
 

- జంధ్యాల రఘుబాబు
98497 53298