Aug 27,2023 06:44
  • పోరాడి ఓడిన గోదావరి టైటాన్స్‌ శ్రీ ఎపిఎల్‌ సీజన్‌-2

ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఎపిఎల్‌) సీజన్‌-2 ఫైనల్స్‌కు రాయలసీమ కింగ్స్‌ జట్టు ప్రవేశించింది. విశాఖలోని పిఎం.పాలెం ఎసిఎ-విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో రాయలసీమ కింగ్స్‌ జట్టు మూడు పరుగుల తేడాతో గోదావరి టైటాన్స్‌పై గెలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 218 పరుగుల అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ కెహెచ్‌.వీరారెడ్డికేవలం 47 బంతుల్లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లుతో 92 పరుగులు చేశాడు. టి.వంశీకృష్ణ, కెప్టెన్‌ జిహెచ్‌.విహారి చెరో 43 పరుగులు చొప్పున 86 పరుగులు చేశారు. భారీ లక్ష్య ఛేదనలో గోదావరి టైటాన్స్‌ 20 ఓవర్లులో 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆ జట్టు ఓపెనర్‌ బ్యాట్స్‌మ్యాన్‌ మునిష్‌ రెడ్డి 40 బంతుల్లో 5 సిక్స్‌లు, 12 ఫోర్లుతో 89 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్స్‌ రాణించకపోవడంతో గోదావరి జట్టు గెలుపు ముంగిట బోల్తాపడింది.