న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారు హైసెన్స్ తమ టెలివిజన్, ఎసి, రిఫ్రిజిరేటర్ విభాగాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజాను నియమించుకున్నట్లు ప్రకటించింది. ఇది యువ, ఔత్సాహిక వినియోగదారులలో ప్రజాదరణను ప్రతిబింబిస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత మార్కెట్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి జడేజాతో క్యాంపెయిన్ దోహదం చేయనుందని హైసెన్స్ ఇండియా సిఇఒ ప్రణబ్ మొహంతి పేర్కొన్నారు.