Sep 05,2023 15:10
  •  లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా కె.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : విశాఖపట్నం నగర పోలీస్‌ నూతన కమిషనర్‌గా విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ డిపార్ట్మెంట్‌కు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న 1994 బ్యాచ్‌కు చెందిన ఏ.రవి శంకర్‌ను నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్‌.జవహర్‌రెడ్డి మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదు నెలలుగా విశాఖ పోలీస్‌ కమిషనర్‌ విధులు నిర్వహిస్తున్న 2005 ఐపిఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీ.ఎం త్రివిక్రమ్‌ వర్మ ఐజిగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా విశాఖపట్నం నగర లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న 2016 బ్యాచ్‌కి చెందిన వాసన్‌ విద్యాసాగర్‌ నాయుడును గ్రేహౌండ్స్‌ ఎస్‌పిగా బదిలీ చేశారు. అతని స్థానంలో అనంతపురం ఎస్‌పిగా పని చేస్తున్న కె.శ్రీనివాసరావును విశాఖపట్నం నగర లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా నియమించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీ.ఎం త్రివిక్రమ్‌ వర్మ, డీసీపీ విద్యాసాగర్‌ నాయుడు ఏప్రిల్‌ మొదటి వారంలో ఒకేసారి బదిలీపై విశాఖకు వచ్చి ఒకే సారి బదిలీ వెళ్ళడం గమనార్హం.
 

srinivasarao