Apr 04,2023 12:31

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండలంలోని బుర్రిలంకకు చెందిన సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు అరుదైన తియ్యని దుంప పంటను సాగు చేస్తున్నారు. మొక్క వేరున భూమిలో పండే ఈ దుంపలు ఆరంజ్‌ , ఎల్లో , బీట్‌ రూట్‌ రంగుల్లో లభిస్తున్నాయి. చిలకడ దుంప జాతికి చెందిన ఇవి అధిక పోషకాలు కలిగి ఉంటాయని , ఈ దుంపలు పిండి పదార్ధాలు , పీచు పదార్ధాలు , వివిధ రకాల విటమిన్లు కలిగి ఉండడం వల్ల ఆరోగ్యానికి శక్తినిస్తాయని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. రెండేళ్ల కిందట థాయిలాండ్‌ నుండి ఈ మొక్కలను దిగుమతి చేసుకొని జాగ్రత్తగా పెంచినట్లు రైతు దుర్గారావు అంటున్నారు. ఈ మొక్కలు 90 నుండి 120 రోజుల్లో కాపునిస్తాయని , ఒక్కో మొక్క రూ. 50 నుండి రూ. 70 రేటులో తన వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు.