ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఈ నెల 16 వ తేదీన జరుగనున్న కడియం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కమిటీ సభ్యులు మండల అధికారులను కోరారు. గురువారం కడియం సిఐ తిలక్, తహశీల్దార్ ఎం.సుజాత , ఎంపిడిఓ కే.రత్నకుమారి , ఎంఈఓ -2 ఏడిద నాగేశ్వరరావులను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నర్సరీ అసోసియేషన్ కు జరుగుతున్న ఎన్నికలు సజావుగా సాగేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ ప్రతినిధులు బొరుసు సుబ్బారాయుడు, పాఠంశెట్టి చిన్న మహాలక్ష్మి నాయుడు , మార్గాని సత్యనారాయణ , తిరుమలశెట్టి భాస్కరరావు , ఆకుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.