ప్రయివేటు రంగంలోని ఇండుస్‌ఇండ్ బ్యాంక్ 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 22 శాతం వృద్థితో రూ.2,202 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,805.28 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 18 శాతం పెరిగి రూ.5,077 కోట్లకు చేరడం, ఇతర ఆదాయం 13.5 శాతం వృద్థితో రూ.2,281.9 కోట్లుగా నమోదయ్యింది. ఈ రెండు అంశాలు బ్యాంక్ మెరుగైన ఫలితాలకు ప్రధాన మద్దతును అందించాయి. సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.93 శాతంగా, నికర ఎన్‌పిఎలు 0.57 శాతంగా నమోదయ్యాయి.