ప్రజాశక్తి - బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు ఉత్తమ అధికారి పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లె నియోజకవర్గం,బి.కొత్తకోట మండలం ఎస్‌ఐగా రామ్మోహనకి ఉత్తమ ఎస్‌ఐ పురస్కారంతో సత్కరించారు. మంగళవారం రాయచోటి లోని ఎస్పీ పెరేడ్ గ్రౌండ్ వద్ద ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ఎస్.గిరీష, ఎస్పీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామ్మోహన మాట్లాడుతూ ... తాను చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం తనను పురస్కారంతో సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. భవిష్యత్తులో ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి న్యాయం చేస్తూ ప్రజలకు, చట్టపరమైన న్యాయానికి మరింత కఅషి చేస్తానన్నారు. ఉత్తమ ఎస్‌ఐ పురస్కారం అందుకున్న రామ్మోహనకి పలువురు మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.










