ప్రజాశక్తి-పిచ్చాటూరు (తిరుపతి) : పిచ్చాటూరు జడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ ఓటర్లు దినోత్సవం కార్యక్రమం తహశీల్దార్ మధుసూదన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కారక్రమంలో ఎంఈవో హేమమాలిని జడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యుగంధర్ రాజు ఏ.ఎస్సై వెంకటాద్రి రాజు డిటి వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు. తహశీల్దార్ మధుసూదన్ సీనియర్ సీటీజన్స్‌ను పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం స్థానిక జాతీయ రహదారిపై విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు అవసరంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేష్ ఆర్.ఐ సుధాకర్ ఉపాధ్యాయులు రవి, పి టి అములు, వీఆర్వో ప్రియాంక సచివాలయం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.










