ప్రజాశక్తి - పల్నాడు : పల్నాడు జిల్లా పరిథిలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం పరిశీలించారు. నరసరవుపేట పట్టణంలోని యస్.యస్.ఎన్ కళాశాలలోని బాలుర వసతి గృహంలో జరుగుతున్న ఏర్పాట్లను జెసి పరిశీలించి పలు సూచనలు చేశారు. భారతదేశ పరిరక్షణ కోసం జరుగుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ కోసం వస్తున్న అభ్యర్థులకు వసతుల కల్పనలో ఇక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి ఎం.శేషిరెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ అనిల్ కుమార్, సంభందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.