Aug 20,2023 20:48

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా :అగ్నిపథ్‌ కింద చేపట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ ఎల్‌ శివశంకర్‌ ఆదివారం ప్రారంభించారు. ర్యాలీలో పాల్గనేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అభ్యర్థులు శనివారం రాత్రే స్టేడియం వద్దకు చేరుకున్నారు. వీరికి పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల బాలుర హాస్టల్లో వసతి కల్పించారు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ర్యాలీలో అభ్యర్థులు అర్హతల సాధించాలని ఆకాంక్షించారు. మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నవారే రాణిస్తారని, వాటిని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెసి శ్యామ్‌ ప్రసాద్‌, కల్నల్‌ పునీత్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.