Sep 24,2023 12:44

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ (తిరుపతి) : పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణంలో వర్షపు నీరు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్టాండ్‌ లోపలికి వెళ్లడానికి వీలులేకుండా వర్షపు నీరు నిల్వ నిలిచిపోవడంతో నడక ప్రయాణం కావడం లేదని విద్యార్థులు, ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ లోపలికి వెళ్లాలంటే ప్రధాన మార్గమైన రహదారిలో వర్షపు నీరు ఎక్కువగా నిలిచిపోయింది దీంతో దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ వర్షపు నీరు నిలిచిన చోట హౌటల్స్‌ తినుబండారాలు కూల్‌ డ్రింక్‌ షాపులు ఉన్నాయి. అలాగే బైక్‌లను పార్కింగ్‌ చేయడానికి వెళ్లడానికి కూడా ఈ వర్షపు నీరు అడ్డంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. దీనిపై డిపో మేనేజరు స్పందించడం లేదని అక్కడి ప్రయాణికులతోపాటు దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా డిపో మేనేజర్‌ స్పందించాలని పలువురు కోరుతున్నారు.