అమరావతి : ఎపిలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఎపిలోని పలుచోట్ల శుక్రవారం, శనివారం వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రానున్న 4 రోజుల్లో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ ... కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్లద్దని అన్నారు. రైతులు, కూలీలు, గొర్రెలకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.