Aug 12,2023 15:42

శ్రీకాకుళం : పోలీసులు దైనిందాక విధి నిర్వహణలో ఉన్న సాధక బాధలు తెలుసుకుని వర్షాలు పడే సమయంలో హౌంగార్డులకు ఎంతోగానో ఉపయోగపడే రైన్‌ కోట్స్‌ ఇవ్వడానికి డాక్టర్‌.దానేటి శ్రీధర్‌ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక కొనియాడారు.శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న హౌంగార్డులకు డాక్టర్‌. దానేటి శ్రీధర్‌ ఆర్ధిక సహకారంతో కొనుగోలు చేసిన రైన్‌ కోట్స్‌ ను జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక చేతులు మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖకు మీ వంతు సహకారాన్ని అందించాలని కోరిన వెంటనే ఆయన స్పందించి వర్షాకాలంలో హౌంగార్డు లకు ఎంతగానో ఉపయోగపడే 300 రైన్‌ కోట్స్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్‌ శాఖ తరపున డాక్టర్‌ శ్రీధర్‌ నకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.డాక్టర్‌ దానేటీ శ్రీధర్‌ మాట్లాడుతూ జిల్లా పోలీసు యూనిట్‌ అధికారిణిగా పోలీసు సిబ్బంది సంక్షేమనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఏటా 20లక్షల రూపాయలు హౌంగార్డుల పిల్లలు ఉన్నత చదువులు కోసం ఈ ఏడాది నుంచి కేటాయిస్తున్నానని తెలిపారు.అనంతరం జిల్లాలో పనిచేస్తున్న హౌం గార్డలకు రైన్‌ కోట్స్‌ జిల్లా ఎస్పీ,శ్రీధర్‌ అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి జే తిపే స్వామి డిఎస్పిలు ఎస్‌ వాసుదేవ్‌ వై.శృతి, డి.ప్రసాదరావు,ఆర్‌ఐ ఉమా మహేశ్వరావు హౌంగార్డ్స్‌ పాల్గొన్నారు.