తీవ్రమైన అనారోగ్యం
ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు
హైదరాబాద్ : రెయిన్‌బో హాస్పిటల్ వైద్యులు మరో అరుదైన వైద్య చికిత్స చేశారు. దేశంలోనే తొలిసారి ఎక్మోపై ఉన్న అతి తక్కువ వయసు కలిగిన శిశువును వాయు మార్గంలో తరలించి రక్షించారు. తీవ్రమైన న్యుమోనియా, ఎఆర్‌డిఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా తమ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుందని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ చిన్నారిని రక్షించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అద్భుతమైన టీమ్‌వర్క్, సమన్వయం, నిబద్ధతను ప్రదర్శించిందన్నారు. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్య చొరవ జరగడం ఇదే తొలిసారి అన్నారు. తమకు కాల్ వచ్చిన వెంటనే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, ఎక్మో శిక్షణ పొందిన పెర్ఫ్యూషనిస్ట్ శిక్షణ పొందిన ఇంటెన్సివ్ కేర్ నర్సు, బయోమెడికల్ బఅందం గోవా వెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి చిన్నారని వాయు మార్గంలో తరలించామన్నారు. ఎయిర్ అంబులెన్స్ బృందానికి పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కపిల్ బి సచానే నేతృత్వం వహించారన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని సురక్షితంగా ఉందని నిర్దారించడానికి తమ బృందం అవిశ్రాంతంగా పని చేసిందన్నారు. పిల్లల జీవితాలను రక్షించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, మారుమూల ప్రాంతాల నుండి కూడా అనారోగ్యంతో ఉన్న రోగులకు వైద్యం అందించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తీవ్రంగా శ్రమిస్తోందని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల పేర్కొన్నారు.