ట్రినిడాడ్ : రెండో టెస్టులో ఐదో రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు. భారత్ నిర్దేశించిన 365పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాల్గో రోజు ఆటలో భాగంగా వెస్టిండీస్ జట్టు 2 వికెట్ల నష్టానికి 76పరుగుల వద్దే ఐదోరోజు ఆట నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌ను రెండు వికెట్ల నష్టానికి 181 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా... వెస్టిండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్(38), రోహిత్ శర్మ(57), శుభ్ మాన్ గిల్ (29నాటౌట్), ఇషాన్ కిషన్ (52నాటౌట్) పరుగులు చేశారు. ఛేదన భాగంగా వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 28 పరుగులు చేయగా, కిర్క్ మెకెంజీ(0) డకౌట్ అయ్యాడు. వీరిద్దరినీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ పంపాడు. నారాయణ్ చందర్ పాల్ 24, జెర్మైన్ బ్లాక్ వుడ్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వెస్టిండీస్ గెలవాలంటే ఇంకా 289 పరుగులు చేయాల్సి ఉంది.










