ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ఆయన అనౌన్స్ చేశాడు.ఈ సీక్వెల్‌కు శపథం అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ఒకే పోస్టర్ ద్వారా వ్యూహం, శపథం సినిమాల విడుదల తేదీలని అనౌన్స్‌చేశాడు. వ్యూహం సినిమాను నవంబర్ 10 వ తేదీన, అలాగే వ్యూహం సినిమాకు సీక్వెల్ గా వస్తున్న శపథం సినిమాను 2024 జనవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమాల్లో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నారు.










