Jul 13,2022 19:01

''నటిగా మారాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. నా దృష్టి పూర్తిగా మార్షల్‌ ఆర్ట్స్‌ కెరీర్‌పైనే ఉంది. నేను ఒలింపిక్‌లోనూ పాల్గొన్నాను. సినిమా పరంగా వర్మకు వీరాభిమానిని. ఓరోజు అతని కార్యాలయం నుండి నాకు కాల్‌ వచ్చినప్పుడు, నేను ఉద్వేగానికి లోనయ్యాను. మా నాన్నతో కలిసి ముంబైలో ఆయనను కలవడానికి వెళ్లాను. బ్రూస్‌లీకి నివాళిగా 'అమ్మాయి' సినిమా తీస్తానని చెప్పారు. ఆయన బ్రూస్‌ లీ అబ్సెషన్‌ గురించి మాట్లాడాడు. ఆర్జీవీ సర్‌తో కెరీర్‌ ప్రారంభించడం చాలా థ్రిల్‌గా ఉంది'' అని రియల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్లేయర్‌ పూజా భలేకర్‌ తెలిపారు. ఈ సినిమా చైనాలో కూడా విడుదలవుతుంది. తెలుగులో అమ్మాయిగా పేరు పెట్టారు. జులై 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ''మార్షల్‌ ఆర్ట్స్‌ టాలెంట్‌ లేకుంటే నాకు అవకాశం వచ్చేది కాదు. ఈ సినిమా ద్వారా అమ్మాయిలను మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొనేలా ప్రేరేపించగలనని అనుకుంటున్నాను'' అని చెప్పారు.