తాడేపల్లి : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ సిఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సిఎం ఇంటిలో కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. సిఎం ఇంట్లోనే ఆర్జీవీ భోజనం చేశారు. వీరిద్దరి భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయన్నది ఆసక్తిగా మారింది.










