దర్శకుడు రామ్‌గోపాల వర్మ తీసిన కొత్త చిత్రం 'వ్యూహం'. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఏపీలో గతంలో జరిగిన రాజకీయ అంశాలు కీలకంగా ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదం, మరణించిన తర్వాత ఏపీలో ఎటువంటి వాతావరణం అలముకుంది. రాష్ట్రంలో ఉన్న కీలకమైన రెండు పార్టీల మధ్య, కుటుంబసభ్యుల్లో సృష్టించిన అలజడి, జరిగిన వివాదాల నేపథ్యంలో సినిమా నడిపారు. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలి పార్టు కాగా, రెండోది శపథం. తొలి పార్టులో వైఎస్‌ఆర్ మరణం, తర్వాత ఏం జరిగిందని చూపించారు. రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.










