Aug 09,2023 21:40

ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా నేటితో ముగియనుంది. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సమీక్షా నిర్ణయాలను వెల్లడించనున్నారు. దేశంలో టమాట ధరలు భారీగా పెరగడం, ఉల్లి, పప్పుల ధరలు ప్రమాధ ఘంటికలను మోగిస్తున్న వేళ ఆర్‌బిఐ సమీక్షా అత్యంత కీలకం కానుంది. ద్రవ్యోల్బణ కట్టడికి 2022 మే నుంచి 2022 ఫిభ్రవరి మధ్య కాలంలో కీలక వడ్డీ రేట్లను 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ దఫా వడ్డీ రేట్లను యథాతథంగా ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు, పలు ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి.