Mar 03,2023 21:03

ముంబయి : ఇాకామర్స్‌ సంస్థ అమెజాన్‌కు చెందిన అమెజాన్‌ పేకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. పలు నిబంధనలు పాటించని ఆ సంస్థకు ఆర్‌బిఐ రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. అమెజాన్‌ పే (ఇండియా) ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పిపిఐలు), నో యువర్‌ కస్టమర్‌ (కెవైసి)లకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించలేని ఆర్‌బిఐ తెలిపింది. దీనిపై ఆ సంస్థను వివరణ కోరినప్పటికీ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో ఆర్‌బిఐ కఠిన నిర్ణయం తీసుకుంది.