Mar 25,2023 21:08

న్యూఢిలీ : కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) చేపట్టనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీల షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి మీటింగ్‌ను ఏప్రిల్‌ 3ా6 తేదిల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత జూన్‌, ఆగస్టు, అక్టోబర్‌, డిసెంబర్‌, 2024 ఫిబ్రవరిలో ఎంపిసి సమావేశాలు ఉంటాయని తెలిపింది. ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. తొలి సమావేశం మినహా మిగితా వాటిని మూడు రోజుల పాటు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులతో పాటు ఆర్థికాంశాలను చర్చిస్తారు.