Sep 05,2023 16:55

దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ వన్డేలకు వీడ్కోలు పలికాడు. వరల్డ్‌ కప్‌-2023కు ఆ జట్టును ప్రకటించిన కాసేపటికే డికాక్‌ నుంచి మంగళవారం ఈ ప్రకటన వచ్చింది. వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేలకు డికాక్‌ దూరం కానున్నాడు. 140 వన్డేలు ఆడిన డికాక్‌ 44.85 సగటు, 96.08 స్ట్రయిక్‌రేట్‌తో 5,966 రన్స్‌ చేశాడు. ఇప్పటికే టెస్టులకు డికాక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే టీ20లలో డికాక్‌ కొనసాగే అవకాశం ఉంది.