ప్రజాశక్తి కర్నూలు : ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులకు ఆవాజ్ కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నగర అధ్యక్షులు పి.ఇక్బాల్ హుస్సేన్ ఆవాజ్ నగర కార్యదర్శి మొహమ్మద్ షరీఫ్, ఆవాజ్ నగర కమిటీ నాయకులు అబ్దుల్ నయీమ్, ఫయాజుల్ కరీం ,ఇలియాజ్, ఇంతియాజ్, ఫయాజ్ ఖాద్రి, షేక్షావలి, మహబూబ్ బాషా, ఖలీల్ ఖాన్, గౌస్ బాషా, అక్బర్ అలీ ,అబ్దుల్ రహమాన్, నూర్ వలి తదితరులు పాల్గొన్నారు.










