Mar 07,2023 20:30

హైదరాబాద్‌ : ప్యూర్‌ ఇవి ఆవిష్కరించిన చౌక విద్యుత్‌ మోటర్‌సైకిల్‌ ఎకోడ్రిఫ్ట్‌ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. తొలి విడత డెలివరీలను హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని తమ డీలర్‌షిప్‌ ఔట్‌లెట్ల వద్ద అందజేస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉగాది, గుడిపడ్డా రోజు మార్చి 22 నుంచి డెలివరీలను ప్రారంభించనున్నామని పేర్కొంది. ఈ బైకు ప్రారంభ ధరను రూ.99,000గా నిర్ణయించింది. గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లతో ప్రయాణిస్తే మూడు డ్రైవింగ్‌ మోడ్స్‌లో 130 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఈ వాహనం మద్దతు చేస్తుందని తెలిపింది. దేశంలో తమకు ప్రస్తుతం 130కి పైగా ఎక్స్‌క్లూజివ్‌ అవుట్‌లెట్లు ఉన్నాయని.. 2023 ముగింపు నాటికి 300 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.