
న్యూఢిల్లీ : మైక్రోసాఫ్ట్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పునీత్ చందోక్ నియమితులయ్యారు. చందోక్ భారత్‌తో పాటు దక్షిణాసియాలో కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి చందోక్ నూతన బాధ్యతలు చేపడతారని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. చందోక్ గతంలో అమెజాన్.కాం క్లౌడ్ డివిజన్ ఎడబ్ల్యుఎస్‌లో పనిచేశారు.