Aug 08,2023 20:56

ముంబయి : ప్రముఖ ఫర్నీచర్‌, హోమ్‌ డెకార్‌ ఉత్పత్తులను విక్రయించే ఇ-కామర్స్‌ సంస్థ పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అంబరీష్‌ మూర్తి హఠన్మారణం చెందారు. 51 ఏళ్ల అంబరీష్‌ సోమవారం లేహ్ లో గుండెపోటుతో మరణించారని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు అశిష్‌ షా ఎక్స్‌ ఓ ట్వీట్‌లో తెలిపారు. తరుచూ ముంబయి నుంచి లేహ్ కు బైక్‌పై వెళ్లే అంబరీష్‌ లేహ్ కు చేరుకున్న తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. 2012లో మూర్తి, ఆశిష్‌తో కలిసి పెప్పర్‌ఫ్రైను స్థాపించారు.