ప్రజాశక్తి - చక్రాయిపేట(కడప) : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని మహదేవ పల్లె గ్రామ సచివాలయ నూతన భవనాన్ని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఓఎస్‌డి.అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. జడ్పిటిసి శివప్రసాద్ రెడ్డి, మహదేవపల్లె సర్పంచ్ ఊరిమిండి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. చక్రాయపేట మండలంలో 1500 మంది మామిడి రైతులకు ఒక్కొక్కరి ఖాతాలో 50వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించిందన్నారు. మండలంలోని విద్యుత్తు, భూముల సర్వే, తదితర అంశాల పైన ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వారు అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ బెల్లం ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడి శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ మాధవి బాలకృష్ణ, ఎంపీడీవో శివారెడ్డి, తహశీల్దార్ రాజసింహ నరేంద్ర, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, ఉద్యాన సహాయకులు వినోద్, హౌసింగ్ ఏఈ వసురప్ప తదితరులు పాల్గొన్నారు.










