Apr 07,2023 07:55

కలానికి కులం లేదు
కవనానికి మతం లేదు
సాహిత్యానికి భాషాబేధం లేదు
ఉన్నదల్లా ఒక్కటే .....
ప్రశ్నించే తత్వం
ప్రక్షాళన చేసే నైజం
మార్పు తెచ్చే గుణం
మేల్కొలిపే భావజాలం
మేలు చేసే భాషాభావం
ఎదిరించే పిడికిలి
మానవత్వం కోసం
నిత్యం పోరాడే పటిమ
సమానత్వం కోసం
పరితపించే హృదయం
అదే కలం.....
అదే కవనం....
అదే సాహిత్యం....
 

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 9441791239