Jul 27,2023 21:03
  •  కార్యాలయంలో దీక్ష చేపట్టిన మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో గత రెండు రోజులుగా ప్రొటోకాల్‌ వివాదం నడుస్తోంది. ప్రొటోకాల్‌ సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌ గత రెండు రోజులుగా సమాధానం ఇవ్వకుండా, తన ఛాంబర్‌కు రాకుండా ఉండడాన్ని నిరసిస్తూ టిడిపి మున్సిపల్‌ కౌన్సిలర్లతో కలిసి చైర్మన్‌ జెసి.ప్రభాకర్‌ రెడ్డి దీక్ష చేపట్టారు. బుధవారం రాత్రి నుంచి ఆయన మున్సిపల్‌ కార్యాలయంలోనే ఉన్నారు. గురువారం ఉదయం జెసి ప్రభాకర్‌రెడ్డితో మున్సిపల్‌ కమిషనర్‌ గడ్డం రవి, అధికారులు చర్చలు జరిపారు. కూరగాయల మార్కెట్‌ సమీపంలో ఉన్న చేపల మార్కెట్‌కు వేలం వేయాలని జెసి.ప్రభాకర్‌రెడ్డి వారికి సూచించారు. ఇందుకు ఆగస్టు 8వ తేదీన వేలానికి సిద్ధం చేస్తామని అధికారులు ఆయనకు చెప్పారు. అధికారుల హామీతో టిడిపి కౌన్సిలర్లు, జెసి.ప్రభాకర్‌ రెడ్డి దీక్ష విరమించారు.