Aug 09,2023 12:24

టి.నరసాపురం (ఏలూరు) : మణిపూర్‌లో స్త్రీలపై జరుగుతున్న హత్యాచారాలకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి పూర్తి బాధ్యత వహించాలని, ఇప్పటికైనా మణిపూర్‌ రాష్ట్ర ప్రజలకు శాంతిని చేకూర్చాలని ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ .... టీ.నర్సాపురం మహిళా సంఘం మండల నాయకురాలు మడకం కుమారి బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ నగర్‌ గ్రామస్తులు పి.నరసాపురం గ్రామస్తులు కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... 29 రాష్ట్రాల్లో ప్రజల్లో మణిపూర్‌ లో జరుగుతున్న సంఘటనను, గత నాలుగు నెలల నుంచి మీడియాను సైలెంట్‌ చేసి అక్కడున్న గిరిజనులపై పెత్తందారులు చేస్తున్న హింసలను మీడియా సైలెంట్‌ చేసిందని విమర్శించారు. స్త్రీలను నగంగా బయట ప్రదేశాలలో నడిపించి మానభంగాలు చేశారని వాపోయారు. ఇప్పటికైనా 29 రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని ఖండించాలని కోరారు. మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దేనికి పూర్తి బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు నగర గ్రామస్తులు, ఉత్తర గ్రామస్తులు కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.