Sep 09,2023 13:27

ప్రజాశక్తి-గుంటూరు: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ-చెన్నై జాతీయ రహదారి దిగ్బంధం చేసి టైర్లు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్‌ ఫిరోజ్‌, ఐటీడీపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషు, గుంటూరు అర్బన్‌ టీడీపి కార్యదర్శి నిస్సంకర అమర్నాథ్‌, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్‌ యాదవ్‌, జిల్లా తెలుగుయువత ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు టిడిపి నాయకులు పాల్గొన్నారు.