
ప్రజాశక్తి-మంగళగిరి : మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా తెలుగుదేశం మంగళగిరి నియోజకవర్గ నాయకులు శనివారం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన తెలిపారు. రోడ్డుకి అడ్డంగా కూర్చొని నిరసనని తెలియజేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.