Apr 29,2023 12:47

ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : పురపాలక సంఘం కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకావటానికి ముందుగా మున్సిపల్‌ మార్కెట్‌ ఎదుట టిడిపి కౌన్సిలర్లు నోటికి నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. గత నెల సమావేశంలో టిడిపి కౌన్సిలర్‌ దేశు యుగంధర్‌పై వైసిపి కౌన్సిలర్‌ చేసిన దాడి ఘటనకు నిరసన ప్రదర్శనగా కౌన్సిల్‌కు హాజరయ్యారు. సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని, ప్రతిపక్ష నేతల ప్రాణాలు కాపాడాలి, కౌన్సిలర్‌ ప్రాణాలు రక్షించాలి, అధికారపార్టీ నాయకుల మూకుమ్మడి దాడి నుంచి రక్షణ కల్పించాలంటూ ఫ్ల కార్డులతో నినాదాలు చేశారు.