Sep 05,2023 16:04

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమగోదావరి) : హర్యానా రాష్ట్రం ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కారం చేయాలని, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని సిఐటియు ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగుపాటి జ్యోతి అన్నారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా డే సందర్భంగా ఆల్‌ ఇండియా ఆశా యూనియన్‌ పిలుపు మేరకు మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మధ్యాహ్నం విరామ సమయంలో నల్ల రెబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దిగుపాటి జ్యోతి మాట్లాడుతూ.. హర్యానా ప్రభుత్వంఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల అమలు చేయాలని , ఆగస్టు 8 నుండి జరుగుతున్న శాంతియుత సమ్మెకు ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్గిస్తు నాయకత్వంపై నిర్బంధాలు, అరెస్టులు చేయటం మానవ హక్కులను కాల రాయటం అని విమర్శించారు. సమ్మెలో పాల్గొంటున్న ఆశ వర్కర్లను పోలీసు వ్యానుల్లో ఎక్కించి దౌర్జన్యంగా రోజంతా కనీసం మంచినీళ్లు, వసతులు కూడా కల్పించకుండా మహిళలను అత్యంత దుర్మార్గంగా వేధించడం పట్ల ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌గా ఖండిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి దేశవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సహితం లెక్కచేయకుండా ,ప్రభుత్వ ఎటువంటి రాయితీలు కల్పించకపోయిన ప్రజలకు సేవలు అందించిన వారి పట్ల ఇంత చిన్నచూపు తగదని దుయ్యపడ్డారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశ వర్కర్ల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్స్‌ ను పరిష్కారం చేయాలని , జరుగుతున్న సమ్మెకు ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌గా 26 జిల్లాల్లో సంఘీబావం తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లీడర్లు లక్ష్మీ దుర్గ , పి రత్నకుమారి, కే కనకదుర్గ , పార్వతి , నాగలక్ష్మి , శ్రీదేవి ,గంగా రత్నం ,
భవాని , సుశీల , మేరా , లక్ష్మీ దుర్గ తదితరులు పాల్గొన్నారు.