న్యూఢిల్లీ : నగదు లభ్యతను పెంచుకోవడానికి అదాని గ్రూప్ ప్రమోటర్లు తమ వాటాలను తగ్గించుకోవాలని భావిస్తోన్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎసిసి లిమిటెడ్ మినహా మిగిలిన కంపెనీల్లో అదానీ కుటుంబానికి 60 శాతానికి పైగా వాటా ఉంది. వాటిలోని వాటాలను తగ్గించుకోవాలని యోచిస్తున్నారని రిపోర్టులు వస్తోన్నాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదాని కుటుంబం పలు కంపెనీల్లోని తమ వాటాలను తగ్గించుకున్న విషయం తెలిసిందే. మరోమారు వాటాల తగ్గింపునపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే నిధులతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తోన్నారు. గడిచిన కొన్ని నెలల్లో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు పలు మార్లు 3 బిలియన్ డాలర్లు విలువైన వాటాలను విక్రయించిన విషయం తెలిసిందే.