Sep 02,2023 16:42

ప్రజాశక్తి - రేపల్లె (బాపట్ల) : రేపల్లె పట్టణంలోని డాక్టర్‌ వేజళ్ళ ప్రకాశరావు ప్రముఖ వైద్యులు (84) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. గత 50 సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సేవా దృక్ఫదంతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. పట్టణంలో సేవకు మారుపేరుగా నిలిచిన డాక్టర్‌ వేజళ్ళ ప్రకాశరావు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి అన్నారు. వేజళ్ళ ప్రకాశరావు మంచి హస్తవాసి గల డాక్టర్‌ అని అతి స్వల్ప ఫీజు, అతి తక్కువ మందులు, సరైన రోగ నిర్ధారణ ఆ డాక్టర్‌ ప్రత్యేకత అని తెలిపారు. రేపల్లెలో వైద్య సేవలు అందించి మంచి డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు. ఈయన మృతి వార్త తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ బి.ఎల్‌.కె ప్రసాద్‌ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, డాక్టర్‌ వేజళ్ళ ప్రకాశరావు మృతదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.